Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Prana Priyuda Yesu Raja Arpinthunu Naa Hrudayarpana

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ

Naa Prana Priyuda Yesu Raja Arpinthunu Naa Hrudayarpana

Chorus
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా
Verse
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా
బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్
Verse
వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి
ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా
Verse
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని
నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా
Verse
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా
నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును

Related Tags

WorshipDevotionalJesus