Verse 1
Reference: యెహోవా నా కాపరి లేమి కలుగదు కీర్తన Psalm 23:1
Verse
నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించును
ఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు
Verse
పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్
పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను
Verse
నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్ను
మోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్
Verse
పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదు
నా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ
Verse
నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవు
నీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను
Verse
నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్
స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు