Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Premikudaa Naa Praana Naadhudaa

నా ప్రేమికుడా నా ప్రాణ నాధుడా

Naa Premikudaa Naa Praana Naadhudaa

Lyricist: Hannah Grace
Verse
నా ప్రేమికుడా నా ప్రాణ నాధుడా
నిన్నే నే ఆరాదింతున్
నా తోడు నీవే నా ఆశ నీవే
నిన్నే నే ఆరాదింతున్
నీ కృపతో నన్ను హెచ్చించావు
నీ సాక్షిగా నన్ను నిలిపావు
నా కన్నీటిని తుడిచావు
నన్ను ప్రేమతో హత్తుకొన్నావు
నీవే మార్గము
నీవే సత్యము
నీవే జీవము
నా యేసయ్యా
నిన్నే కీర్తింతును యేసయ్యా
నిన్నే ప్రేమింతును యేసయ్యా
నిన్నే సేవింతును యేసయ్యా
నిన్నే ఘనపరతును యేసయ్యా
పావనుడా పోషకుడా
పరిశుద్ధుడా నా యేసయ్యా
నీ రాజ్యములో నను చేర్చుటకు
నీ ప్రాణమునే అర్పించితివి

Related Tags

PraiseWorship