Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Priya Yaesunipai Aanukoni Aranya

నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్

Naa Priya Yaesunipai Aanukoni Aranya

Chorus
నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున
నడుచుటయే ఆనంద జీవితము‖ నా ‖
Verse
లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి
పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ‖ నా ‖
Verse
కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే
యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను‖ నా ‖
Verse
ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే
జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ‖ నా ‖
Verse
నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని
నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్‖ నా ‖
Verse
అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది
నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు‖ నా ‖
Verse
దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో
ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును‖ నా ‖

Related Tags

WorshipDevotionalJesus