Verse
నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు
దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు
Verse
సాతానుకు నే దాసుదనై నాశమొందగా
నాతాను ద్వారా తెలిపితివి నాదు ప్రియుడా
Verse
వ్యాదిగ్రస్తుండనై హౄదయక్షీణ మొందితిన్
బాధల నొంది తప్పియుంటి నాదు ప్రియుడా
Verse
తప్పిన రూక, పిల్లవాడు, గొర్రెవలెనే
తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా
Verse
తలిదండ్రులు విడిచినను నీవు విదువవు
చల్లగ ప్రక్కజేర్చి బ్రోతువీవు ప్రియుడా
Verse
నావాదవైతివి నేను నీదు వాడను
నాయాపదయందున్న ప్రభువు నాదు ప్రియుడా
Verse
ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు
ఆ భాగ్యమును చూడనిమ్ము నాదు ప్రియుడా
Verse
రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా
ఈ క్షితిలో నెల్లరకు చాట నాదు ప్రియుడా