Verse
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు‖ నా ప్రియమైన ‖
Verse
ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని‖ 2x ‖
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని‖ 2x నా ప్రియమైన ‖
Verse
ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం‖ 2x ‖
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై‖ 2x నా ప్రియమైన ‖
Verse
లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని‖ 2x ‖
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై‖ 2x నా ప్రియమైన ‖
Verse
ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు‖ 2x ‖
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము‖ 2x నా ప్రియమైన ‖
Verse
మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును‖ 2x ‖
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి‖ 2x నా ప్రియమైన ‖