Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Priyamaina Yesuprabhu Velaadistothramulu

నా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములు

Naa Priyamaina Yesuprabhu Velaadistothramulu

Verse
నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు
నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
Verse
ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి
Verse
ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై
Verse
లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై
Verse
ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము
Verse
మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి

Related Tags

PraiseWorshipThanksgiving