Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Priyudaa Paapavimochakudaa Prabhuyesu

నా ప్రియుడా పాపవిమోచకుడా ప్రభుయేసు

Naa Priyudaa Paapavimochakudaa Prabhuyesu

Verse
నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు‖ 2x ‖
నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను‖ 2x ‖
స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు‖ 2x ‖
Verse
యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్
యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం
యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం
Verse
తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్
తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ
తల్లి మరిచిన మరువ డేసు - నిరతము
Verse
సూర్యకాంత సుగంధ సునీల - సువర్ణము
సూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములో
సూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో
Verse
బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో
నాకై గాయపడిన - బంగారు నీ మోమున్
రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్
Verse
సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు
జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు

Related Tags

PraiseWorshipSalvation