Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Priyudu Naavaadu Nenu Athani Vaadanu

నా ప్రియుడు నావాడు నేను అతని వాడను

Naa Priyudu Naavaadu Nenu Athani Vaadanu

Chorus
నా ప్రియుడు నావాడు నేను అతని వాడను
Verse
నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు
దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా
Verse
ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు
ఈయన మాట వినుడనిన - పరమజనకుండా
Verse
ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగాలేని
ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా
Verse
కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో
కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు
Verse
మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను
ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్
Verse
క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు
క్షణక్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా
Verse
నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము
నిత్య మహిమలో నీతో మేము - మెరయుచుందుము

Related Tags

WorshipDevotionalJesus