Verse
నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల‖ 2x నా ప్రియుడు ‖
Verse
మెల్లని చల్లని స్వరమే వినబడెను‖ 2x ‖
తండ్రీ వీరేమి చేయుచున్నారో‖ 2x ‖
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే‖ నా ప్రియుడు ‖
Verse
అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను‖ 2x ‖
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం
శాపమంతా బాపి నను దీవించెనుగా‖ నా ప్రియుడు ‖
Verse
వీపంతా దున్నబడె నాగలితో
కారె రక్త వరదల్ కనుమా‖ 2x ‖
యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత
నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా‖ నా ప్రియుడు ‖
Verse
తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి
నాకై విన్నతి చేయుచున్నాడు‖ 2x ‖
రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే
నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును‖ నా ప్రియుడు ‖