Chorus
నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర పాపుల పాప భార విమోచక
నా రక్షకా
Verse
నిత్యకాలమునందు నిజమైన దేవుని సత్యవాక్యమై యున్న స్వామి
నిన్నుతియింతు‖ నా రక్షకా ‖
Verse
సర్వ లోకంబులను సత్యవాక్యమై యుండి నిర్వహించిన దేవుని
నిజబాహువా స్తుతింతు‖ నా రక్షకా ‖
Verse
దేవజనులకు సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ
నుతియింతు‖ నా రక్షకా ‖
Verse
దేవ మహిమ ప్రకాశ దీనరక్షక మాను ష్యావతారము దాల్చి
యావదాజ్ఞల దీర్చిన‖ నా రక్షకా ‖
Verse
పావనాద్భుతుడవై పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర
దేదీప్యుడా స్తుతింతు‖ నా రక్షకా ‖
Verse
పాపాత్ములను గావ శాపభారము క్రింద నోపికతో నిల్చి ప్రాపు
జూపిన ప్రభువా‖ నా రక్షకా ‖
Verse
ఈ వసుధను ప్రేమ నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా
స్తుతింతు‖ నా రక్షకా ‖
Verse
ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు
వినయ స్తోత్రంబిదిగో‖ నా రక్షకా ‖