Verse
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్
బరమ కిరీట మొందువరకు.‖ యేసున్ ‖
Chorus
యేసున్ నేను ఎన్నఁ డెన్నడును
ఆసతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్
Verse
నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్
ప్రయాసమైన లోయలై భయ పడన్
దయఁ జూపు యేసు నన్ను వెం డించుచో
భయ మేల భువనంబులోదగన్
Verse
నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్
భీకరింపు వాధియైన నేదాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కితండ్రిఁ చువరకున్.