Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Rakshakuni Vembadimthu Nannitan Ghoaramaina Komdalaina Jamkomdanu

నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను

Naa Rakshakuni Vembadimthu Nannitan Ghoaramaina Komdalaina Jamkomdanu

Verse
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగా నేను వెళ్ళెదన్
పరమ కిరీట మొందువరకు
Chorus
యేసున్ నేను ఎన్నడెన్నడును
ఆశతో నన్నిటన్ వెంబడింతును
భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్
మూసికొని యెక్కడేని వెళ్ళుదున్
Verse
నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్
బ్రయాసమైన లోయలైన భయపడన్
దయజూపు యేసు నన్ను వెంబడించుచో
భయమేల భువనంబులో దగన్
Verse
నా కాలమెల్ల యేసునందు నమ్ముదున్
భీకరంపు వార్థియైన నే దాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కి తండ్రి జూచు వరకున్.

Related Tags

FaithDevotionDiscipleship