Verse
నా సమీపమై యున్న - నా దేవుడవేసయ్యా
నా చేరువలో ఉన్న - నా ఆత్మీయ బంధువుడా‖ 2x ‖
నా ముందూ వెనకను నీవే - నా ఇరుప్రక్కలను నీవే‖ 2x ‖
అంతట వ్యాపించి యున్న - మహిమా ఘనతయు నీకే‖ 2x ‖
Verse
తెలిసి తెలిసి ఎన్నో మారులు - దోషము చేసిన పాపిని‖ 2x ‖
కలువరి రుధిరముతో - కడిగిన నాధుడవు
కరుణా కాటాక్షము - నిలిపిన ప్రభుడవు‖ 2x ‖
Verse
నిరాశ నిస్పృహ వేళలో - గమ్యము చూపిన ఘనుడవు‖ 2x ‖
వెనుకున్నవి మరచి - ముందున్న మకుటముకై
సియోనులో చేరుటే - నా చిరకాల కోరిక‖ 2x ‖