Verse
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను
Verse
విలువైన గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా
కలిగియున్న రక్షణలో దాగియుంటిని
Verse
ఇంకా నేను ఫరోకు దాసుడను కాను
ఇంకా నేను సీయోను కన్యుడను గాను
Verse
మార్చబడు నాదు మారా మధురముగా
పారు జలము బండనుండి త్రాగుచుందును
Verse
సౌందర్యమయమగు పరమ కానాను
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు
Verse
ఆనందమే పరమానందమే
కానాను జీవితము నా కానందమే
Verse
నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు
నా దేవుడిచ్చు క్రొత్తమన్నా నాకు చాలును
Verse
నా యేసు ప్రభువే నా బలము గానము
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా