Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Sankata Dukhamulella

నా సంకట దుఃఖములెల్ల

Naa Sankata Dukhamulella

Lyricist: Songs Of Zion
Verse
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను‖ 2x నా సంకట ‖
Verse
విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా‖ 2x ‖
కలిగియున్న రక్షణలో దాగియుంటిని‖ 2x నా సంకట ‖
Verse
ఇంకా నేను ఫరోకు దాసుడను కాను‖ 2x ‖
ఇంకా నేను సీయోను కన్యుడను గాను‖ 2x నా సంకట ‖
Verse
మార్చబడు నాడు మారా మధురముగా‖ 2x ‖
పారు జలము బండనుండి త్రాగుచుండును‖ 2x నా సంకట ‖
Verse
సౌందర్యమయమగు పరమ కానాను‖ 2x ‖
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు‖ 2x నా సంకట ‖
Verse
ఆనందమే పరమానందమే‖ 2x ‖
కానాను జీవితము నా కానందమే‖ 2x నా సంకట ‖
Verse
నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు‖ 2x ‖
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును‖ 2x నా సంకట ‖
Verse
నా యేసు ప్రభువే నా బలము గానము‖ 2x ‖
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా‖ 2x నా సంకట ‖

Related Tags

WorshipComfortSalvation