Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Sankatambulanniyu Theeripoye

నా సంకటంబులన్నియు తీరిపోయె

Naa Sankatambulanniyu Theeripoye

Chorus
నా సంకటంబులన్నియు తీరిపోయె
సంహారరదూత నన్ను దాటిపోయె
Verse
గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో
కడుగబడి నేను రక్షణ బొందితిన్‖ నా సంక ‖
Verse
ఫరోకు నేనింక దాసుడను కాను
పరమకానానుకు హక్కుదారుడను‖ నా సంక ‖
Verse
మారాను మధురముగ మార్చినాకు
బండను పగులగొట్టి దాహం దీర్చెను‖ నా సంక ‖
Verse
మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే
అదే నాకు స్థిరమైన అవకాశము‖ నా సంక ‖
Verse
ఆనందమే పరమానందమే
కానాన్ జీవితము నాకు ఆనందమే‖ నా సంక ‖
Verse
అరణ్యజీవితమున యేసు నాయకుడు
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు‖ నా సంక ‖
Verse
నా బలము నా ఆశ్రయము
నా రక్షణ యేసయ్య హల్లెలూయా‖ నా సంక ‖

Related Tags

SalvationEasterFreedom