Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Sannidhi Neeku Thoduga Undunu Chettuku Manchu Vale

నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె

Naa Sannidhi Neeku Thoduga Undunu Chettuku Manchu Vale

Lyricist: Sharon Praveen
Chorus
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే‖ 2x ‖
Verse
ఉన్నత బహుమానం నీవు పొందెదవు
పక్షిరాజు వలె పైకి ఎగిరెదవు‖ 2x ‖
Verse
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే
Verse
ఇప్పుడు నీకుఉన్న నీ శత్రువులను ఇకపై ఎన్నడును చూడబోవులే‖ 2x ‖
నీ పక్షముగా యుద్ధము చేసి వారిపై నీకు విజయమునిచ్చి‖ 2x ‖
నీ తోడుగ నేనుందును నిన్ను విడువను‖ 2x ‖
॥నా సన్నిధి నీకు ॥‖ నా సన్నిధి నీకు ‖
Verse
ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును ఇకపై ఎన్నడును రానివ్వనులే‖ 2x ‖
నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి నిత్యానందము నీపై ఉంచి‖ 2x ‖
నీ తోడుగ నేనుందును ఆశీర్వదింతును‖ 2x ‖
॥నా సన్నిధి నీకు ॥‖ నా సన్నిధి నీకు ‖
Verse
ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నియును రెండంతలుగాను నీవు పొందుకొందువులే‖ 2x ‖
శాశ్వతమైన ప్రేమను చూపి విడువక నీ యెడ కృపలను ఇచ్చి‖ 2x ‖
నా ఆత్మతో నిన్ను నింపెదను నిన్ను నడిపెదను‖ 2x ‖
॥నా సన్నిధి నీకు ॥‖ నా సన్నిధి నీకు ‖

Related Tags

BlessingGods LoveGods Presence