Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Sarvamaina Prabhoo Arpimchukomdhu Neekai Amgeekarimchu Naedae Nee Saeva Chaeyutakai

నా సర్వమైన ప్రభూ అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై

Naa Sarvamaina Prabhoo Arpimchukomdhu Neekai Amgeekarimchu Naedae Nee Saeva Chaeyutakai

Verse
నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై
అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై
Verse
ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు
అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా
జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత
Verse
వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో
నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో
ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత
Verse
నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును
నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము
మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత

Related Tags

SurrenderDedicationService