Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Snehithudaa

నా స్నేహితుడా

Naa Snehithudaa

Lyricist: Davidson Gajulavarthi
Verse
నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
నా స్నేహితుడా… నా యేసయ్యా‖ 2x ‖
విడువక నను ఎడబాయని నేస్తమా‖ నీతో ‖
Verse
నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా
శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా
లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా
కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా
ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా‖ నా స్నేహితుడా ‖
Verse
నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా
కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా
అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా
ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా
ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా
ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా‖ నా స్నేహితుడా ‖

Related Tags

WorshipComfortFriendship