Verse
నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా - నా ఆరాధనకు
నీవే యోగ్యుడవయ్యా
Verse
నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
నీ వాక్యమే నా పాదములకు దీపము‖ 2x ‖
Verse
నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
నీ కృపయే నా జీవన ఆధారము‖ 2x ‖
Verse
నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము‖ 2x ‖