Verse
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా‖ 2x ‖
Verse
నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము‖ 2x ‖
నీ వాక్యమే నా పాదములకు దీపము‖ 3x నా స్తుతి పాత్రుడా ‖
Verse
నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము‖ 2x ‖
నీ కృపయే నా జీవన ఆధారము‖ 3x నా స్తుతి పాత్రుడా ‖
Verse
నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము‖ 2x ‖
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము‖ 3x నా స్తుతి పాత్రుడా ‖