Chorus
నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా‖ 2x ‖
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే‖ 2x ‖
Verse
నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది‖ 2x ‖
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు‖ 2x నా స్తుతుల ‖
Verse
ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా‖ 2x ‖
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన‖ 2x నా స్తుతుల ‖
Verse
నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి‖ 2x ‖
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద‖ 2x నా స్తుతుల ‖