Verse
నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా‖ 2x ‖
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా‖ 2x ‖
యేసయ్యా హల్లెలూయా‖ 4x నా తల్లి ‖
Verse
స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా‖ 2x ‖
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా‖ 2x విడుదలని ‖
Verse
లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా‖ 2x ‖
సాతానే నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా‖ 2x విడుదలని ‖