Verse
నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు‖ 2x ‖
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
Verse
నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది‖ 2x ‖
నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది‖ లోకం ‖
Verse
నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ఈ ప్రేమ – ఎక్కడ కనరాలేదు‖ 2x ‖
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివే‖ నా తండ్రి ‖