Verse
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే‖ 2x ‖
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా‖ నా తండ్రి ‖
Verse
నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి‖ 2x ‖
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ‖ 2x యేసయ్యా ‖
Verse
గాడాంధకార లోయలో
నే నడచిన ప్రతివేళలో
తోడున్న నా తండ్రివి‖ 2x ‖
వేయిమంది కుడి ఎడమకు
కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ‖ 2x యేసయ్యా ‖