Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Thanuvu Naa Manasu

నా తనువు నా మనసు

Naa Thanuvu Naa Manasu

Lyricist: Swapna Edwards
Verse
నా తనువు నా మనసు
నా నైపుణ్యం నీ కొరకే
నా తలంపులు నా మాటలు
నా క్రియలు నీ కొరకే
నా ప్రయాసే కాదు
నీ కరుణతో నిలిచింది ఈ జీవితం
నీ నామం కీర్తించాలని
నీ బలం చూపించాలని
అందుకేగా నన్నిలలో నియమించితివి
Verse
నీ స్వరూపముగా
నీ శ్వాసతో నను సృజియించితివి
నీ మహిమగా నేనుండుటకు
నీతోనే జీవించుటకు‖ 2x ‖
అందుకేగా నన్నిలలో సృజియించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి‖ నా తనువు ‖
Verse
గర్భ వాసమున లేనప్పుడే
నన్ను ప్రతిష్టించితివి
నీ వెలుగునే ప్రకాశించుటకు
నీ ప్రేమనే పంచుటకు‖ 2x ‖
అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి‖ నా తనువు ‖

Related Tags

WorshipCommitmentDedication