Verse
నా వేదనలో ఆవేదనలో
నీ వాక్యమే నను బ్రతికించినది
నా రోదనలో నా యాతనలో
నీ మాటలే నను ఓదార్చినవి
యేసయ్యా----- యేసయ్యా-------‖ 2x ‖
Verse
చేయని నేరము చేసెను గాయము
వేసిన నెపము మోపెను భారము
నా కృప చాలును అన్న నీ మాటే
నను బ్రతికించెనయ్యా.
యేసయ్యా. యేసయ్యా.....
నీ వాత్సల్యమునే మరువలేనయ్యా
Verse
చేసిన మేలే కీడుగా మారె
చూపిన ప్రేమే చేదుగా మిగిలె
ఒంటరినైన నన్ను చేరదీసావే
నన్ను ఆదరించినావే (నడిపించినావే)
యేసయ్యా...... యేసయ్యా......
నీ మమకారమునే మరువలేనయ్యా