Chorus
నా వేదనలో - వెదకితిని
శ్రీ యేసుని -పాదాలను
నా మనస్సులో - కోరితిని
నీ రూపమునే - దీనుడనై
నీ రూపమునే - దీనుడనై
నా వేదనలో - వెదకితిని
Verse
వేకు జాములో - విలపించితిని
నా పాపములో - వ్యసనములో‖ 2x ‖
ఓదార్చుము - విసుగొందక
నీ కృపలో - నా ప్రభువా‖ 2x నా వేదన ‖
Verse
నీ హస్తములో - నిదురింప జేయుమా
నీ ప్రేమలో - లాలించుమా‖ 2x ‖
ఓదార్చుము - విసుగొందక
నీ కృపలో - నా ప్రభువా‖ 2x నా వేదన ‖