Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yaesu Naa Yaathma Balamaa Needu Ga

నా యేసు నా యాత్మ బలమా నీదు గ

Naa Yaesu Naa Yaathma Balamaa Needu Ga

Verse
నా యేసు! నా యాత్మ బలమా! నీదు గాయంబులే నిలువబలమైన స్థలము
సకల సృష్టి పునాదియపుడే నాదు సకల పాపములకై బలియైతి వేసు!
సకల భూమ్యాకాశములను సమము గా గతించినఁగాని నీ ప్రేమ
నిలుచు‖ నా ‖
Verse
నా తండ్రి! నీ నిత్య కృపను నెంచ నా తరమ? నీ ప్రేమ హస్తముల జూచి
పాతకుల రండంచు బిలిచి వేగ నీదు కృప రుచి జీవంబు నిచ్చు‖ నా ‖
Verse
దరిలేని లోతైన ప్రేమా! నీలో దురిత యెల్లను మునిఁగి పోవు
దరిలేని యుచిత కృపఁ జాటు నీదు రక్తంబు నా పాపడాగులను గడిగె
||నా||‖ నా ‖
Verse
ఈ ప్రేమ సాగరంబున నే దుమికి నా ప్రభుని యెదదూరి విశ్రాంతి
నొంది యే ప్రొద్దు సంతసించెదను నన్ను నా ప్రాణమును డాయదిఁక
నరక మొందు‖ నా ‖
Verse
నా శిరముపై నలలురేగి యిలను నా సత్తువయు స్నేహితులు నన్ను
వీడి నా సుఖము నా సంతసము బోయి నను నీదు కృప నన్ను
విడిపోదు తండ్రీ‖ నా ‖
Verse
నా హృదయమే నిలిచిపోనీ నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ ధర
పునాదులే కరిగిపోనీ యేసు నిరతంబు నీ ప్రేమ నిలుచు నను బ్రోచు‖ నా ‖

Related Tags

PraiseWorshipSalvation