Verse
నా యేసు నాధా ననుఁ జూడవే నా జీవనాధా నా యేసునాధ మా
నవ పాప మోచక నీ యనుగ్రహముచే నిరతంబు భువిలోన‖ నా యేసు ‖
Verse
వింటిని నేను నా హృదయంబు వింతఁ బొందఁగను మింటనుండి
నీవు మేదిని కరుదెంచి యెంటి నర్పించితి వొనరంగ నా కొరకు‖ నా యేసు ‖
Verse
నీ యానతులను నిజముగ మీరి నే నుంటి మున్ను నా యెదను
గుందుచు నా పాపముల కొరకు నీ యొద్దఁ జేరెద నిజరక్షకుఁడ వనుచు‖ నా యేసు ‖
Verse
నేను నీ నెనరు రుచి జూచితి నిది యెంతో తనరు దీనుఃడ నగు నేను
ధృడ కృతజ్ఞత ప్రేమల్ గానుపింపఁగ నీ కడకు వత్తును దేవ‖ నా యేసు ‖
Verse
నే నశక్తుడను నిను సేవింప నిత్యంబు ధరను గానఁ బ్రార్థనఁ బూని
ఘనుఃడ వని నమ్ముచు నానందమున వత్తు ననిశంబు నీ దరికి‖ నా యేసు ‖
Verse
దయ చేయు మయ్యా సత్యాత్మను దాసుని కిపుడు దయచేసి శుద్ధాత్మఁ
ద్వరగాఁ గల్గించుము ప్రియముగ నీ సేవ పెంపుసేయఁగ శక్తి‖ నా యేసు ‖
Verse
నీవు నాతోడ నెప్పుడు నుండు నిజ మొనగూడ నీవు నాతో నుండ
నిర్భయముగ నేను ద్రోవఁ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు‖ నా యేసు ‖