Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yanna Raagade O Yesu Thandri Na

నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి న

Naa Yanna Raagade O Yesu Thandri Na

Lyricist: Purushothamu Choudari
Chorus
నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ
ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న
రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ
యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు‖ నా యన్న ‖
Verse
ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై
యున్నట్లుగా నిట్టూర్పులతోఁ తలంతు నకట నా రాతి గుండె శకలంబై
పోవునట్లుగా‖ నా యన్న ‖
Verse
పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ
ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ
కరుణన్ దర్శింతు నేఁడు‖ నా యన్న ‖
Verse
ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన
నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ
ప్రేమఁ జూతు‖ నా యన్న ‖
Verse
తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు
నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు
పిలిపించి వేఁడుకొందు‖ నా యన్న ‖

Related Tags

RepentanceGood FridayPassion