Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yedala Neekunna

నా యెడల నీకున్న

Naa Yedala Neekunna

Lyricist: Adam Benny
Verse
నా యెడల నీకున్న తలంపులన్ని‖ 2x ‖
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య‖ 2x ‖
అవి రమ్యమైనవి అమూల్యమైనవి‖ 2x ‖
నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య
నాకై నీవు తలంచుచున్నావా‖ 2x నా యెడల ‖
Verse
రాజువైన నీవు దాసుడవయ్యావా
దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే‖ 2x ‖
అభిషేకించావు అధికారం ఇచ్చావు‖ 2x ‖
పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు
నీకే స్తోత్రము యేసయ్య‖ 2x నా యెడల ‖
Verse
ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా
దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే‖ 2x ‖
ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు‖ 2x ‖
సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు‖ 2x ‖
నీకే స్తోత్రము యేసయ్య‖ 2x నా యెడల ‖
Verse
బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా
బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే‖ 2x ‖
నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు‖ 2x ‖
నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు
నీకే స్తోత్రము యేసయ్య‖ 2x నా యెడల ‖

Related Tags

PraiseWorship