Verse
నా యేసయ్య ప్రేమ
నా తండ్రి గొప్ప ప్రేమ‖ 2x ‖
వర్ణించగలనా నా మాటతో
నే పాడగలనా క్రొత్త పాటతో‖ 2x నా యేసయ్య ‖
Verse
నా పాపనిమిత్తమై
సిలువనూ తానే మోసే
ఈ ఘోర పాపి కొరకై
తన ప్రాణము అర్పించెనే‖ 2x ‖
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే‖ 2x నా యేసయ్య ‖
Verse
తప్పి పోయిన నన్ను
వెదకి రక్షించితివే
ఏ దారి లేక ఉన్నా
నీ దరికి చేర్చితివే‖ 2x ‖
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే‖ 2x నా యేసయ్య ‖