Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yesoo Aathma Sooryudaa Neeva

నా యేసూ ఆత్మ సూర్యుఁడా నీవ

Naa Yesoo Aathma Sooryudaa Neeva

Lyricist: John Keble
Verse
నా యేసూ, ఆత్మ సూర్యుఁడా
నీవున్న రాత్రి కమ్మదు
నా యాత్మలో నీ విప్పుడు
వసించి పాయకుండుమీ.
Verse
నేను నిద్రించు వేళలో
నాకు నభయ మియ్యుము
నే లేచి పనిచేయఁగా
నా యొద్ద నుండు రక్షకా.
Verse
నాతోడ రాత్రింబగళ్లు
నీ వుండి నడిపించుము
నీవు నాతో లేకుండినన్
జీవింపఁ జావఁజాలను.
Verse
నేఁడు నీ దివ్య వాక్యము
వినిన పాపు లెల్లరిన్
క్షమించి గుణపఱచి
నీ మందలోకిఁ జేర్చుము.
Verse
రోగిని స్వస్థపఱచి
బీదలను పోషించుమీ
దుఃఖించువారి దుఃఖముఁ
బాపి యానంద మియ్యుము.

Related Tags

WorshipDevotionalPrayer