Verse
నా యేసు ప్రభువా నిన్ను నేను
ఆరాధించెదను స్తుతియింతును‖ 2x ‖
నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు
ఆనందించెదను చిరకాలము నీలో‖ 2x ‖
Verse
నీ స్నేహమే నా బలము
నీ ఊపిరే నా జీవము
నీ వాక్యమే ఆధారము
నాకు ధైర్యమిచ్చును‖ 2x నీ ప్రేమా ‖
Verse
నా ప్రాణమైన యేసయ్యా
నీవుంటే నాకు చాలును
నీ కోసమే నే జీవింతున్
నిజమైన ప్రేమికుడా‖ 2x నీ ప్రేమా ‖
Verse
యేసయ్యా నా రక్షకా
యేసయ్యా నా జీవమా
యేసయ్యా నా స్నేహమా
నాదు ప్రాణ ప్రియుడా‖ 2x నీ ప్రేమా ‖