Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yesu Raajutho Nenu Saagi Podunu

నా యేసు రాజుతో నేను సాగి పోదును

Naa Yesu Raajutho Nenu Saagi Podunu

Verse
నా యేసు రాజుతో నేను సాగి పోదును‖ 2x ‖
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను‖ 2x ‖
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను‖ 2x ‖
నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ‖ 3x హల్లెలూయ హల్లెలూయ ‖
Verse
శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా‖ 2x ‖
యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును‖ 2x ‖
నాకు తోడై జయ మిచ్చును .. సాతనును పార ద్రోలెదను ..
Verse
శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా‖ 2x ‖
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును‖ 2x ‖
స్వస్థత నిచ్చి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
Verse
ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా‖ 2x ‖
యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును‖ 2x ‖
నన్ను కాచి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
Verse
నా యేసు రాజుతో నేను సాగి పోదును‖ 2x ‖
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను‖ 2x ‖
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను‖ 2x ‖
క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ‖ 3x ‖
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ

Related Tags

PraiseFaithVictory