Verse
నా యేసూ నీ పాదాల చెంతా
నే ధ్యానింతును జీవితమంతా‖ 2x ‖
మరువను దేవా నీ త్యాగము
విడువను ప్రభువా ఈ భాగ్యము‖ 2x ‖
పూర్ణ మనస్సుతో… పూర్ణ బలముతో…
పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును‖ నా యేసూ ‖
Verse
పలుమార్లు నిన్ను నే వీడినాను
నీ గాయాలను నే రేపినాను‖ 2x ‖
కోపించక ఎప్పుడూ… నా రాకకై
నీ కరుణించే కనుచూపుతో
కాంక్షతో వీక్షించిన దేవా‖ మరువను ‖
Verse
నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను
నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను‖ 2x ‖
విసుగక ఎప్పుడూ… నా ప్రార్థనకై
నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో
వాంఛతో వేచిన దేవా‖ మరువను ‖