Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadha Samuyaelu Reethi Nee Yaamodha Sha

నాధా సముయేలు రీతి నీ యామోద శ

Naadha Samuyaelu Reethi Nee Yaamodha Sha

Lyricist: Frances Ridley Havergal
Verse
నాధా! సముయేలు రీతి
నీ యామోద శబ్దము
సేవకుఁడ నైన నన్ను
నాతో డాలకింపనీ
నాతో నీవేమందువో
నే నాలించువాఁడను.
Verse
నీ మాట గ్రహించునట్లు
దానిఁ దేటపర్చుము
నిన్ను వెంబడించునట్లు
నిబ్బరింపఁ జేయుము
నేను నీదు గొఱ్ఱెను
'బండ నీడలో మేపు'
Verse
నేను స్వల్పశిష్యుడను
నన్ నిరాకరింపకు
నిన్నాలింప నెంత యాశ
నీ వెఱింగి యుందువు
ఆత్మ యక్కరల్ తీర్చు
ధన్యుఁడన్ నే నౌదును
Verse
నాధా, నీ శబ్ద మాలింప
నన్ను సిద్ధపర్చుము
నీదుమాట లక్ష్య పెట్టి
నిత్యసేవఁ జేయనీ
నాతో నీవేమందువో
నే నాలించువాఁడనే.

Related Tags

PrayerDevotionService