Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadha Yaesu Naadha Kreesthu Naadha Naenana

నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేనన

Naadha Yaesu Naadha Kreesthu Naadha Naenana

Lyricist: Pasupuleti David
Chorus
నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ సాధు జనులఁ బ్రోచు
సదయు నీ దయ కాదా‖ నాధ ‖
Verse
గతిఁ దలఁపని మూర్ఖచిత్త గమనుఁడనే గానా సతతముననుఁ గరుణఁ
బ్రోచెడు గతియ నీవు కావా‖ నాధ ‖
Verse
పాపమందు జననమైన పామరుండ నేఁగానా కటకట ననుఁ గని
కరించు కరుణ నీది గాదా‖ నాధ ‖
Verse
కుటిల బుద్ధిగల వాఁడను క్రూరుఁడ నేఎఁగానా కటకట ననుఁ గని
కరించు కరుణ నీది గాదా‖ నాధ ‖
Verse
ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్లఁ బ్రోచు
బిరిదు నీది గాదా‖ నాధ ‖
Verse
సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనులఁ
గోరి పిలువ లేదా‖ నాధ ‖
Verse
జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు
గావా‖ నాధ ‖

Related Tags

WorshipDevotionalPrayer