Chorus
నాదు హృదయపు ద్వారము తెరచెదను
యేసు పాపపు రోగికి నీవే గతి
Verse
యేసు చచ్చిన వారిని లేపితివే - మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివే
నేను పాపిని రోగిని నీవేగతి - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ
Verse
ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి
నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి
Verse
యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ నాకు వేరొక మార్గము లేదికను
Verse
ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా
నేను పాపిని అంధుని యేసూ ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ