Chorus
నాదు ప్రాణమా నాదు ప్రాణమా
దేవుని క్రియల్మరువకుమా
ఆయన చేసిన దేనిన్ మరువకుమా
Verse
వ్యర్థుడనై నాశనంబౌ నిన్ను రక్షించి
మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే
ఓ నా మనసా యెంతటి ప్రేమా
దేవుని క్రియల్మరువకుమా - నీ‖ దేవుని క్రియల్మరువకుమా ‖
Verse
ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు
ప్రయుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే
సమర్పించు సర్వము తనకే
దేవుని క్రియల్మరువకుమా - నీ‖ దేవుని క్రియల్మరువకుమా ‖
Verse
రక్షణాలం కారవస్త్రము జీవాహారము
శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే
ప్రేమ పరిమళ స్తుతులను పాడి
దేవుని క్రియల్మరువకుమా - నీ‖ దేవుని క్రియల్మరువకుమా ‖
Verse
గెత్సేమనెలో కార్చె నేసు రక్త చెమటలను
వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్
వినుమా మనసా యేడ్చెను నీకై
దేవుని క్రియల్మరువకుమా - నీ‖ దేవుని క్రియల్మరువకుమా ‖
Verse
వచ్చెదననిన కాలమాయె తామసం బేల
పభుని రాక బూరధ్వనించు కాలమెప్పుడో
ఆశతో ప్రభుని రాకడకోరి
దేవుని క్రియల్మరువకుమా - నీ‖ దేవుని క్రియల్మరువకుమా ‖