Verse
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు చేయుచున్నది నాదు నాత్మ
దేవునం దా నం మొందెను నిరతము‖ నాదు ‖
Verse
దేవుఁడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను ఈ వసుంధరఁ దరము
లన్నిఁక నెన్ను నను శుభవతి యని‖ నాదు ‖
Verse
సర్వ శక్తుఁడు మహాకృత్యము సంభవింపఁ జేసెను ఉర్విలో నా ప్రభుని
నామం బోప్పు బరిశుద్ధంబుగా‖ నాదు ‖
Verse
భయము భక్తియుఁ గల్గి దేవుని భజనఁ జేసెడి వారికి నయముగాఁ
దన కృప నొసంగు న నయమును దరతరములు‖ నాదు ‖
Verse
విదిత బాహువు చేత శౌర్యము విభుఁడు కనపర్చెను హృదయపుఁ
దలఁపులను గర్వులఁ జెదరఁ గొట్టెను నిజముగ‖ నాదు ‖
Verse
ఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ బడఁ ద్రోసి దేవుఁడు దీనులను
సిం హాసనంబుల నునిచెను‖ నాదు ‖
Verse
క్షుధితులను దన మధురములచేఁ గోరి తృప్తి పర్చెను అధిక
ధనవంతులను రిక్త హస్తములతో ననిపెను‖ నాదు ‖
Verse
ఆది పితరులైన యబ్రా హాము కతని సంతున కద్వితీయుఁ డాదిలోక
నాన తిచ్చినట్లుగా‖ నాదు ‖
Verse
నిరతమును దన కరుణఁ జూప నిజముగా మది నెంచెను వరదుఁ
డిశ్రాయేలునకుఁ దన వర సహాయ మొనర్చెను‖ నాదు ‖
Verse
పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిఁక నిహ పరమ
లందును యుగయుగంబులఁ బరఁగు మహిమ మామేన్‖ నాదు ‖