Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadu Devaa Naadu Devaa Nannela Vidanaadithivayyaa

నాదు దేవా నాదు దేవా నన్నేల విడనాడితివయ్యా

Naadu Devaa Naadu Devaa Nannela Vidanaadithivayyaa

Verse
నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యా
Verse
నన్ను రక్షింపక ఆర్తధ్వని - వినక నీవేల దూరమున్నావు?
Verse
రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావు
ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న - పరిశుద్ధ దేవుడవై యున్నావు
Verse
మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివి
మొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు
Verse
నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితి
నరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని
Verse
నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచి
తలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు
Verse
యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమో
వాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు
Verse
గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానము
చేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి
Verse
గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవే
నన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే

Related Tags

WorshipPsalmLament