Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadu Jeevithamu Maaripoyinadi

నాదు జీవితము మారిపొయినది

Naadu Jeevithamu Maaripoyinadi

Verse
నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా‖ నాదు ‖
Verse
చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా‖ 2x ‖
పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..‖ నాదు ‖
Verse
కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా‖ 2x ‖
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..‖ నాదు ‖
Verse
లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే‖ 2x ‖
ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా..‖ నాదు ‖
Verse
జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా‖ 2x ‖
చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా..‖ నాదు ‖
Verse
ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై‖ 2x ‖
ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి..‖ నాదు ‖

Related Tags

GraceTestimonySalvation