Chorus
నా(డు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు
నింకఁ జొత్తు మెచ్చుట‖ నాఁడు ‖
Verse
మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె
మనకు గుండె దిగులుగా‖ నాఁడు ‖
Verse
దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప
దొరయైనాఁడుగా‖ నాఁడు ‖
Verse
ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని
యుగ్రమైన దృష్టి హెచ్చఁగా‖ నాఁడు ‖
Verse
కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి
మండు నగ్ని యదిగో వచ్చెఁగా‖ నాఁడు ‖
Verse
దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ
బోయి చెడితిమి‖ నాఁడు ‖
Verse
వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది
నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి‖ నాఁడు ‖