Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakai Cheelina Yuga Yugamula Shila Muk

నాకై చీలిన యుగ యుగముల శిల ముక్

Naakai Cheelina Yuga Yugamula Shila Muk

Lyricist: Tatavarthi Narayanaswamy
Chorus
నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక
రక్షక నన్ను నీ లోపల దాగి వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా‖ నాకై ‖
Verse
చీలఁబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా
పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్నుఁ బావనుఁ జేయు‖ నాకై ‖
Verse
నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా
నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు‖ నాకై ‖
Verse
నేను జేసిన పాపములఁ ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీనుఁ
డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత‖ నాకై ‖
Verse
కట్టఁ బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి
సహాయము లేక నీపై మదిఁ బుట్టి నీ సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య‖ నాకై ‖
Verse
పరమకల్మషుఁడనై నే నీటి ఋగ్గకుఁ బరుగు లెత్తెద నిప్పుడు పరమ
పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర‖ నాకై ‖

Related Tags

RepentanceSalvationJesus