Verse
నా కష్టకాలములో నాదుఃఖ సమయములో
నావేదన శ్రమల బాధల మధ్యలో‖ 2x ‖
నను ఆదరించి నీ ప్రేమను చూపావు
నీ తోడుగా నేనుండగా దిగులెందుకు అన్నావు‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీఉంటే చాలయ్యా‖ 2x ‖
Verse
నా అన్న వారే నను బాధపరచిన
తోడున్న వారే నను త్రోసివేసినా
ఆత్మీయులకు నేను అపార్థమైన
నే నమ్మిన వారే నను మోసము చేసినా‖ 2x ‖
నా తల్లిలా నీవుండి నను హత్తుకున్నావు
నినువిడువను ఎడబాయనని వాగ్దానమునిచ్చావు‖ 2x ‖
Verse
నా స్థితిని చూసి అవమానపరచిన
నీకేమీ లేదని అపహేళన చేసినా
మనుషులంత కలిసి మనసును కలచివేసిన
నిరీక్షణ కరువై నీరాసలో నేనున్నా‖ 2x ‖
నా తండ్రిలా నీవుండి నా తల పైకెత్తెదవు
నీవు ఎన్నటికి నన్ను సిగ్గుపరచవు‖ 2x ‖