Chorus
నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా
శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక‖ నాకేమి ‖
Verse
తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక
నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక‖ నాకేమి ‖
Verse
ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుదు
శాంత జలములు నా చెంతనే యుండు గనుక‖ నాకేమి ‖
Verse
తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు
నలసటను నా తప్పు మన్నించున్ కనుక‖ నాకేమి ‖
Verse
నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను
నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక‖ నాకేమి ‖
Verse
చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను
నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక‖ నాకేమి ‖
Verse
మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము
నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక‖ నాకేమి ‖
Verse
పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన
మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక‖ నాకేమి ‖
Verse
తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి
విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక‖ నాకేమి ‖
Verse
పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల
గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక‖ నాకేమి ‖
Verse
బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు
నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక‖ నాకేమి ‖
Verse
దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి
నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక‖ నాకేమి ‖