Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakenno Melulu Chesithive

నాకెన్నో మేలులు చేసితివే

Naakenno Melulu Chesithive

Verse
నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును‖ 2x ‖
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే‖ 2x నాకెన్నో ‖
Verse
కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే‖ 2x హల్లెలూయా ‖
Verse
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే‖ 2x హల్లెలూయా ‖
Verse
నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే‖ 2x హల్లెలూయా ‖
Verse
నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipGratitude